తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చైనా ఆక్రమించుకున్న మన భూభాగాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. లేక దానిని కూడా యాక్ట్ ఆఫ్ గాడ్గానే అనుకుని చైనా దురాక్రమణలను దేవుని ఖాతాలోనే వేస్తారా? అంటూ చూరకలంటిస్తూ ట్వీట్ చేశారు.
జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఈ విమర్శలు చేశారు రాహుల్.
-
The Chinese have taken our land.
— Rahul Gandhi (@RahulGandhi) September 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
When exactly is GOI planning to get it back?
Or is that also going to be left to an 'Act of God'?
">The Chinese have taken our land.
— Rahul Gandhi (@RahulGandhi) September 11, 2020
When exactly is GOI planning to get it back?
Or is that also going to be left to an 'Act of God'?The Chinese have taken our land.
— Rahul Gandhi (@RahulGandhi) September 11, 2020
When exactly is GOI planning to get it back?
Or is that also going to be left to an 'Act of God'?
"చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఎప్పుడు చర్యలు చేపడుతుంది? లేదా దానిని కూడా యాక్ట్ ఆఫ్ గాడ్‌గా అనుకుని వదిలేస్తారా? "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని చైనాకు గట్టి షాక్ ఇచ్చింది భారత్. దాంతో భారత భూభాగంలోకి రావాలన్న చైనా బలగాల ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
ఇదీ చూడండి: 'దైవదూతగా ఆర్థిక మంత్రే సమాధానం ఇస్తారా?'