కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వ హయాంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆరోపించారు.
"మోదీ పాలనలో ఏమి జరిగింది అంటే... పవిత్ర భారత భూమిని చైనా స్వాధీనం చేసుకుంది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ట్వీట్
తప్పుదోవ పట్టిస్తున్నారు..
ఓ రక్షణ నిపుణుడు చెబుతున్నట్లు ఉన్న రిపోర్టును కూడా రాహుల్ తన ట్వీట్‌కు జత చేశారు.
"వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన బలగాలను వెనక్కి మళ్లిస్తోందన్నది అబద్ధం. మోదీ సర్కార్ ఈ విషయంలో మీడియాను తప్పుదోవ పట్టిస్తోంది. మరోవైపు గల్వాన్ నుంచి భారత సైన్యాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఇది దేశానికి మంచిది కాదు."
- ఓ రక్షణ నిపుణుడు
ఘర్షణ.. శాంతి?
తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద భారత్-చైనా మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 15న అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించగా, చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. అయితే సైనిక చర్చల తరువాత ఇరుదేశాలు తమతమ సైనిక బలగాలను క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయి.
ఇదీ చూడండి: 'పార్లమెంట్ సమావేశాలపై త్వరలో నిర్ణయం'