అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. తీర్పును స్వాగతిస్తూ ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలమేనన్న కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు, వర్గాలు శాంతి, సామరస్యాలతో మెలగాలని కోరింది.
"అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత జాతీయ కాంగ్రెస్ స్వాగతిస్తోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక విలువలు, సోదరభావాలకు కట్టుబడి ఉండాలని, శాంతి, సామరస్యాలను కొనసాగించాలని సంబంధిత పక్షాలను, వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. యుగయుగాలుగా మన సమాజం నిర్వచిస్తోన్న పరస్పర గౌరవం, ఐక్యతలను పునరుద్ఘాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమే."
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఇదీ చూడండి:'దేశభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇది'