పౌరసత్వ చట్ట సవరణను నిరసిస్తూ తీర్మానం ఆమోదించింది బంగాల్ శాసనసభ. సీఏఏను రద్దు చేయాలని, ఎన్పీఆర్(జాతీయ జనాభా పట్టిక), ప్రతిపాదిత ఎన్ఆర్సీ(జాతీయ పౌర పట్టిక)ను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టింది మమతా బెనర్జీ ప్రభుత్వం.
"రాజ్యాంగానికి, మానవత్వానికి పౌరచట్టం వ్యతిరేకంగా ఉంది. కనుక వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలి. ఎన్పీఆర్ను కూడా రద్దు చేయాలి."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
ఈ తీర్మానానికి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, సీపీఎం మద్దతు ఇచ్చాయి.
ఇప్పటికే కేరళ, రాజస్థాన్, పంజాబ్ శాసనసభలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించాయి.
ఇదీ చూడండి:- 54 అడుగుల జెండాతో 'పౌర చట్టం'పై నిరసన