ETV Bharat / bharat

54 అడుగుల జెండాతో 'పౌర చట్టం'పై నిరసన

author img

By

Published : Jan 26, 2020, 2:55 PM IST

Updated : Feb 25, 2020, 4:31 PM IST

పౌర చట్టానికి వ్యతిరేకంగా నెల రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతోన్న దిల్లీలోని షహీన్​బాగ్​ ప్రజలు గణతంత్ర దినోత్సవం నాడు నిరసనలు కొనసాగించారు. 54 అడుగులు ఎత్తయిన జాతీయ జెండాను ఆవిష్కరించి నిరసన తెలిపారు. పౌరచట్టం, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Shaheen Bagh
54 అడుగుల జెండాతో 'పౌర చట్టం'పై నిరసన

పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు దిల్లీ షహీన్​బాగ్​ ప్రజలు.
ఈ సందర్భంగా వందలాది మంది ఆందోళనకారులు.. షహీన్​ బాగ్​లో 54 అడుగుల ఎత్తయిన జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించారు. అనంతరం పౌర చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సీఏఏను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

దిల్లీ షహీన్​బాగ్​లో గత కొద్ది రోజులుగా పౌర చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో మహిళలే అధిక సంఖ్యలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమానికి ప్రధాన కేంద్రమైంది షహీన్​బాగ్​.

54 అడుగుల జెండాతో 'పౌర చట్టం'పై నిరసన

లఖ్​నవూలోనూ..

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలోనూ గణతంత్ర దినోత్సవం నాడు పౌర చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చూడండి: మళ్లీ అదే స్టైల్​... తలపాగాలో మెరిసిన మోదీ

Last Updated : Feb 25, 2020, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.