ETV Bharat / bharat

'వర్షంలో తడిస్తేనే రాజకీయంలో మంచి భవిష్యత్తు'

author img

By

Published : Nov 2, 2019, 5:16 PM IST

Updated : Nov 2, 2019, 8:34 PM IST

శాసనసభ ఎన్నికల్లో శరాద్ ​పవార్​ వర్షంలో తడుస్తూ ప్రచారం చేయటంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో వర్షం వచ్చిన సందర్భాన్ని పేర్కొంటూ.. వర్షంలో తడిస్తేనే రాజకీయంలో మంచి భవిష్యత్తు అంటూ చమత్కరించారు.

వర్షంలో తడిస్తేనే రాజకీయంలో మంచి భవిష్యత్తు

కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆకస్మత్తుగా వర్షం పడింది. దీనిని అదునుగా తీసుకున్న ఆయన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వర్షంలో తడిసిన వారికి రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉంటుందంటూ ఛలోక్తులు విసిరారు.

ముంబయిలోని విలే​పార్లే ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు గడ్కరీ. పైకప్పు లేని వేదికపై ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో వర్షం ప్రారంభమైంది. వెంటనే ఇద్దరు వ్యక్తులు గడ్కరీకి, ఇంటర్​వ్యూ చేసే వ్యక్తికి గొడుగులు పట్టుకున్నారు.

ఈ సందర్భంగా " వర్షంలో తడిచినప్పుడే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని పాత్రికేయులు అంటున్నారు" అని చమత్కరించారు. ఈ మాటలు అక్కడి వారిలో నవ్వులు పూయించాయి. తను వేసిన జోక్​కు తనే పెద్దగా నవ్వారు గడ్కరీ.

ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో సతార ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్ వర్షంలో తడవటాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు గడ్కరీ.

బలమైన సందేశం..

పవార్​ వర్షంలో తడిసిన వీడియో వైరల్​గా మారింది. ఈ వీడియో పార్టీ కార్యకర్తల్లో జీవం పోసింది. దీని ద్వారా బలమైన సందేశం అందించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. సతారా నుంచి పోటీ చేసిన ఎన్​సీపీ అభ్యర్థి.. భాజపా ప్రత్యర్థి ఉదయరంజే భోస్లేపై విజయం సాధించారు.

2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్​సీపీ పుంజుకుంది. గతంలో 13 సీట్లకే పరిమితమైన పవార్ పార్టీ ఈసారి ఏకంగా 53 సీట్లు సాధించింది.

ఇదీ చూడండి: త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​: శివన్

AP Video Delivery Log - 1100 GMT News
Saturday, 2 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1040: US Trump Beto Dog Comment AP Clients Only 4237891
Trump: Beto 'quit like a dog'
AP-APTN-1022: HKong Protest 2 AP Clients Only 4237889
Fresh clashes on the streets of Hong Kong
AP-APTN-1007: Israel Gaza Aftermath AP Clients Only 4237887
Aftermath following attacks in Israel and Gaza
AP-APTN-0917: Iraq Protests AP Clients Only 4237885
Baghdad's 'Turkish Restaurant' at centre of protests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 2, 2019, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.