ETV Bharat / bharat

మందుల కోసం 1300 కి.మీ కాలినడకన! - psoriasis patient waking 1300km

సోరియాసిస్ వ్యాధి సోకి నరకయాతన అనుభవిస్తూ దాదాపు 1300 కి.మీ నడిచాడు ఓ వ్యక్తి. పేదరికంలో మందులు కొనేందుకు దాదాపు 115 రోజులు నడిచి ముంబయి నుంచి తమిళనాడు చేరుకున్నాడు.

Walking from Mumbai to Tiruvallur, Patient admitted in Hospital
మందుల కోసం 1300 కి.మీ కాలినడక!
author img

By

Published : Aug 13, 2020, 11:50 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్ ఇప్పటికీ పేదల బతుకులను చిదిమేస్తూనే ఉంది. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తిని ముంబయి నుంచి తమిళనాడు తిరువళ్లూరు దాకా దాదాపు 1300 కి.మీ నడిచేలా చేసింది.

ఎందుకు..?

సదరు సోరియాసిస్ బాధితుడు తమిళనాడువాసి. అయితే బతుకుతెరువు కోసం ముంబయిలోని ఓ హోటల్​లో పనిచేసేవాడు. 2 నెలలకు ఒకసారి తమిళనాడు తిరువళ్లూరు వచ్చి సోరియాసిస్​ ముందులు తీసుకుని మళ్లీ ముంబయి వెళ్లేవాడు. కానీ అనుకోకుండా వచ్చిన లాక్​డౌన్ ఉపద్రవం ఎక్కడివాళ్లను అక్కడే బంధించింది. మందులు తెచ్చుకునేందుకు రవాణా సౌకర్యాలు లేక.. విమానంలో ప్రయాణించే స్థోమత లేక నడక మొదలుపెట్టాడు బాధితుడు. దాదాపు 115 రోజులు నడిచి తమిళనాడు చేరుకున్నాడు.

బాధితుడి దుస్థితి చూసిన స్థానిక ఎస్ఐ రాజేంద్రన్.. వైద్యాధికారులతో మాట్లాడి అతడ్ని చెన్నైలోని కేఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదీ చదవండి: 'ఆ వార్తలు అవాస్తవం.. ఆయన​ ఆరోగ్యం స్థిరంగా ఉంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.