కేరళలో స్థానిక సమరం చివరి అంకానికి చేరుకుంది. నేడు చివరి దశ పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 354 స్థానిక సంస్థల పరిధిలోని 6,867 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నాలుగు జిల్లాల(మల్లాపురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్)లో జరిగే ఈ పోలింగ్‌కు 10,842 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1,105 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి వాటిని ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 52,285 మంది అధికారులు పాల్గొననున్నారు. సిబ్బందిని ముందురోజే పోలింగ్ సామగ్రితో ఆయా కేంద్రాలకు తరలించింది ఈసీ.
చివరిదశ పోలింగ్‌లో మొత్తం 89,74,993 మంది ఓటు వేయనున్నారు. 42,87,597మంది పురుషులు; 46,87,310 మంది స్త్రీలు సహా.. 86 మంది ట్రాన్స్జెండర్లు ఈ దఫా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 16 న ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇవీ చూడండి: