దేశంలో ప్రస్తుతం నమోదైన పార్టీలు 2293. 1951-52 ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీల సంఖ్య 53 మాత్రమే. అప్పుడు బరిలో నిలిచిన అభ్యర్థులు 1849 మంది.
2014లో లోక్సభ బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 8251. ఈసారి ఇది మరింత పెరిగే అవకాశముంది.
మొట్టమొదట నిర్వహించిన ఎన్నికలకు ఖర్చు రూ. 10 కోట్లు మాత్రమే. 2014లో దాదాపు రూ. 3 వేల 800 కోట్లు ఖర్చు చేశారు. 1989లో ఎన్నికల వ్యయం తొలిసారి రూ. 100 కోట్లు దాటింది. 2004లో వెయ్యికోట్ల మార్కును అధిగమించింది.
ఇదీ చూడండి:
సుదీర్ఘం... వేగం...
- మొదటి సాధారణ ఎన్నికలను 68 దశల్లో నిర్వహించారు. ఇవి నాలుగు నెలలపాటు కొనసాగాయి. 1951 అక్టోబర్ 25న ప్రారంభమై.. 1952 ఫిబ్రవరి 21న ముగిశాయి.
- ప్రస్తుత ఎన్నికలు ఏడు దశల్లో 39 రోజుల్లోనే ముగియనున్నాయి.
శత కోటికి చేరువగా...
- సార్వత్రిక ఎన్నికల కోసం ఈసారి 90 కోట్ల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అంటే దేశ జనాభాలో 69.23 శాతం ఓటర్లే. 2014లో ఓటర్ల సంఖ్య 81.45 కోట్లు.
- తొలి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు(జమ్ము మినహాయించి). అప్పటి దేశ జనాభాలో ఇది 48.56 శాతం.
అలా పెరుగుతూ...
- మొదటి సార్వత్రిక సమరంలో లోక్సభ స్థానాలు 489. ప్రస్తుతం ఆ సంఖ్య 543.
- 1951-52 సాధారణ ఎన్నికల్లో 53 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. ఈసారి దాదాపు 464 పోటీలో ఉంటాయని అంచనా.
- మొదట్లో ఓటరు నమోదు అర్హత వయసు 21గా ఉండేది. 1988 రాజ్యాంగ చట్టం 61వ సవరణతో 18కి కుదించారు.
- మొదటి ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 2 లక్షల 23 వేలు. ఈసారి ఆ సంఖ్య 10. 35 లక్షలు.
- తొలి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది కాంగ్రెస్. అప్పుడు 489 సీట్లలో 364 స్థానాల్లో విజయభేరి మోగించింది. 2014లో ఆ సంఖ్య 44కే పరిమితమైంది.
ఇవీ చూడండి: