తమిళనాడు కన్యాకుమారిలో కట్టుకున్న ఆలిని కుర్చీకి కట్టేసి, కిరోసిన్ పోసి అరిగోసలు పెట్టిన ఓ భర్త అరెస్ట్ అయ్యాడు..
కొలాచెల్కు చెందిన సురేశ్ రాజన్ భార్యను కుర్చీకి కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, నోరు మెదపకుండా బట్టతో చుట్టేసి చిత్రవధకు గురిచేశాడు. భర్త విచిత్ర వైఖరికి తీవ్రంగా కుంగిపోయిన ఆమె ఏడుపులు, మూలుగులు పక్కింటివారి చెవినపడ్డాయి. మహిళ ఆపదలో ఉందని గ్రహించి కాపాడేందుకు వెళితే బయట నుంచి తలుపునకు తాళం వేసి ఉంది. దీంతో, పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు.
"స్థానికుల నుంచి సమాచారమందిన వెంటనే .. ఎస్ఐ సుజిత్ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాళం వేసున్న తలుపును విరగొట్టారు. మహిళకు కట్టిన తాళ్లు విప్పి, ఆమెను కాపాడారు."
-జయలక్ష్మి, కొలాచెల్ పోలీస్ ఇన్స్పెక్టర్
ఘటనా స్థలంలో కిరోసిన్ పోసిన ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు పోలీసులు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. భార్యను చిత్రవధ చేసిన భర్తను అరెస్ట్ చేసి.. సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: నెటిజన్ల మనసుదోచిన నీలి రంగు పాము