ETV Bharat / bharat

సచిన్​ పైలట్​ మద్దతుదారుల సమావేశం.. వీడియో వైరల్​

రాజస్థాన్​ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తమ బలాలను చూపుకునేందుకు పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, ఉప ముఖ్యమంత్రి సచిన్​ పైలట్.​ సీఎం నివాసంలో సీఎల్పీ భేటీ జరిగిన కొద్ది గంటల్లోనే తమ మద్దతుదారులతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఓ వీడియో విడుదల చేసింది పైలట్​ వర్గం. ఈ వీడియోలో 16 మంది ఉన్నట్లు కనిపిస్తోంది.

video of congress mlas
సచిన్​ పైలట్​ మద్దతుదారుల వీడియో విడుదల
author img

By

Published : Jul 14, 2020, 10:02 AM IST

రాజస్థాన్​ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తమ బలాన్ని చూపిస్తూ సచిన్​ పైలట్​ నేతృత్వంలోని కాంగ్రెస్​ క్యాంప్​ సోమవారం అర్ధరాత్రి ఓ వీడియోను విడుదల చేసింది. అందులో 16 మంది ఎమ్మెల్యేలు ఒకే దగ్గర కూర్చుని ఉన్నారు. వారంతా హరియాణా మనేసర్​లోని ఓ రిసార్ట్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

సచిన్​ పైలట్​ మద్దతుదారుల వీడియో విడుదల

ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ నివాసంలో శాసనసభపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి 122 మంది ఎమ్మెల్యేల్లో 106 మంది హాజరైనట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో విడుదల చేయటం గమనార్హం.

పైలట్​ అధికారిక వాట్సాప్​ గ్రూప్​లో 10 సెకన్ల నిడివిగల వీడియోను సోమవారం అర్ధరాత్రి పోస్ట్​ చేశారు. ఈ వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు వృత్తాకారంలో కూర్చుని ఉన్నారు. కానీ, అందులో పైలట్​ ఉన్నట్లు కనిపించలేదు. మరో ఆరుగురు ఉన్నప్పటికీ వారు ఎవరనేది తెలియదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేల్లో ఇద్రరాజ్​ గుర్జార్​, ముకేశ్​ భాకర్​, హరీశ్​ మీనాలు కనిపించారు.

ఈ వీడియోను 'కుటుంబం' అనే క్యాప్షన్​తో ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు పర్యటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్​. దీనికి సమాధానంగా 'కాంగ్రెస్​లో విధేయత అంటే అశోక్​ గహ్లోత్​కు బానిసత్వం.. అది మాకు ఆమోదయోగ్యం కాదు' అని ట్వీట్​ చేశారు ఎమ్మెల్యే ముకేశ్​ భాకర్​.

ఇదీ చూడండి: సచిన్ 'పవర్​ ప్లే': రంగంలోకి రాహుల్​, ప్రియాంక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.