ETV Bharat / bharat

'గెలుపు వారిదే-ముఖ్యమంత్రులూ వారే..' - ఎగ్జిట్ పోల్స్ వార్తలు

మహారాష్ట్ర, హరియాణాల్లో ఎగ్జిట్​ పోల్స్​పై ప్రధాన పార్టీలు విభిన్నంగా స్పందించాయి. జాతీయ మీడియా సంస్థల సర్వేలపై భాజపా హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ పార్టీ తేలికగా కొట్టిపారేసింది.

EXITPOLLS-REAX
author img

By

Published : Oct 22, 2019, 8:20 AM IST

Updated : Oct 22, 2019, 8:36 AM IST

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకే పట్టం కట్టాయి. ఈ ఫలితాలు ప్రధాని నరేంద్రమోదీ పాలన, నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన బహుమానం అని భాజపా శ్రేణులు పేర్కొన్నాయి. గెలుపు తమదేనని, మహారాష్ట్ర, హరియాణాల్లో ముఖ్యమంత్రులుగా దేవేంద్ర ఫడణవిస్, మనోహర్ లాల్ ఖట్టర్​ కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశాయి.

ఎగ్జిట్​ పోల్స్​ను గమనిస్తే మహారాష్ట్ర, హరియాణాల్లో.. కమల దళం విజయకేతనం ఎగురవేయటం ఖాయమని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తెలిపారు.

"విపక్షాలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఇంకా పాతకాలం నాటి రాజకీయ వ్యూహాలనే వారు అనుసరిస్తున్నారు. ఇప్పటికే అవినీతిలో కూరుకుపోయారు. అభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న భాజపా.. మరోసారి విజయకేతనం ఎగరేస్తుంది."

-జీవీఎల్ నరిసింహరావు, భాజపా అధికార ప్రతినిధి

ఊహల్లోనే ఉండనివ్వండి: ఖట్టర్

ఎగ్జిట్​ పోల్​ ఫలితాలను నమ్మలేమని హరియాణా మాజీ సీఎం భూపిందర్​ సింగ్ హుడా వ్యాఖ్యానించారు. తనకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. హుడా ప్రకటనపై ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్ స్పందించారు.

"ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలే.. అక్టోబర్​ 24న పునరావృతం అవుతాయి. మరో రెండు రోజులు వాళ్లను అదే ఊహల్లో ఉండనివ్వండి. నాకేమీ అభ్యంతరం లేదు."

-మనోహర్​లాల్​ ఖట్టర్​, హరియాణా ముఖ్యమంత్రి

కల్పిత ప్రకటనలు

కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎగ్జిట్​ పోల్​ సర్వేలను కొట్టిపారేశారు. ఇవి కేవలం కల్పిత ప్రకటనలుగా అభివర్ణించారు.

"దేశంలో నిరుద్యోగం, వ్యవసాయ, ఆర్థిక సంక్షోభం.. మరోవైపు హరియాణా, మహారాష్ట్ర ప్రభుత్వాల లోపభూయిష్ట పాలన కారణంగా ప్రజలు బాధాకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. పోలింగ్ సమయంలో ప్రజలు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటారనే భావిస్తున్నాం."

-కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేత

ఇదీ చూడండి: మహారాష్ట్ర, హరియాణాల్లో మళ్లీ కమలమే: ఎగ్జిట్​పోల్స్​

RESTRICTIONS: Must credit ESPN. No internet. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: MinuteMaid Park, Houston, Texas, USA. 21st October 2019.
1. 00:00 Various of Nationals warming up
2. 00:40 Nationals Game 1 starting pitcher Max Scherzer
3. 00:53 More of team stretching
4. 01:03 More of Scherzer
5. 01:10 Anthony Rendon (3B), Trea Turner (SS) and Ryan Zimmerman (1B) stretching  
6. 01:31 More of team warming up
7. 01:45 Brian Dozier (2B)
8. 01:54 Rendon
9. 02:03 Turner
10. 02:20 Various of batting practice
SOURCE: SNTV
DURATION: 2:45
STORYLINE:
The Washington Nationals practiced at MinuteMaid Park on Monday (21 October), a day before Game 1 of the World Series.
The Nationals finished off a sweep of the St. Louis Cardinals last Tuesday (15 October) to win the National League and had to wait until Saturday (19 October) to learn their next opponent - the Houston Astros.
The last time the World Series came to Washington was 1933, when the Senators lost to the New York Giants in five games; the lone baseball championship for the city was in 1924, when the Senators defeated the Giants. The Senators eventually left D.C., which didn't have a team at all for more than three decades until the Montreal Expos - who were founded in 1969 and never made it to the World Series - moved to Washington in 2005. The Nationals had never managed to advance in the postseason since arriving, going 0-4 in the NLDS over the last seven years.
Last Updated : Oct 22, 2019, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.