ETV Bharat / bharat

మోదీ 'సీడీఎస్'​ నిర్ణయంపై  ప్రశంసల జల్లు

త్రివిధ దళాలకు ఉమ్మడి సారథ్యం వహించేందుకు 'చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​'ను నియమించాలనే మోదీ సర్కారు నిర్ణయంపై ప్రశంసలు కురిసిపిస్తున్నారు విశ్రాంత మిలిటరీ అధికారులు, భద్రతా నిపుణులు. ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయంతో త్రివిధ దళాలు మరింత బలోపేతమవుతాయని అంటున్నారు.

మోదీకి నిపుణుల ప్రశంసలు
author img

By

Published : Aug 15, 2019, 10:18 PM IST

Updated : Sep 27, 2019, 3:26 AM IST

దేశ భద్రతను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా త్రివిధ దళాలకు ఉమ్మడి సారథ్యం వహించే 'చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​(సీడీఎస్)'ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎర్రకోటలో స్వాతంత్ర్య వేడుకల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది గొప్ప నిర్ణయమని మోదీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు విశ్రాంత సైన్యాధికారులు, భద్రతా నిపుణులు. 19ఏళ్లుగా ప్రతిపాదనకే పరిమితమైన సీడీఎస్​.. కార్యరూపం దాల్చితే జాతీయ భద్రత మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మోదీ నిర్ణయం చరిత్రాత్మకమని హర్షం వ్యక్తం చేశారు మాజీ సైన్యాధిపతి వీ.పీ మాలిక్.

" చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ని నియమిస్తామని ప్రకటించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు. ఈ నిర్ణయంతో జాతీయ భద్రత మరింత పటిష్ఠం అవుతుంది. ఉమ్మడి, బహుళ క్రమశిక్షణా సహకారానికి ఇది దోహదపడుతుందని కచ్చితంగా చెప్పగలను "
- వీపీ.మాలిక్, మాజీ సైన్యాధిపతి

చాలా ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుందని.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు మాజీ నావికాదళాధిపతి సునిల్​ లన్బా.

కార్గిల్‌ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన వేద్‌ప్రకాశ్‌ మాలిక్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వాన్ని అభినందించారు.

లెఫ్టినెంట్‌ జనరల్‌ దీపేంద్ర సింగ్‌ హుడా స్పందిస్తూ.. దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో సలహాలు ఇచ్చేందుకు మిలిటరీ వ్యవస్థలపై ఎన్‌ఎస్‌ఏకు అనుభవం లేదని, సీడీఎస్‌ పోస్ట్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సీడీఎస్​ ఏర్పాటు ప్రక్రియ వివరాలు తెలిసేవరకూ వేచి చూడాలన్నారు వాయుసేన మాజీ అధికారి​ మన్మోహన్ బహదుర్​.

" సీడీఎస్ బాధ్యతలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ పదవి చేపట్టే వారు ముఖ్య కార్యాచరణ అధికారిగా ఉంటారా? లేక.. కార్గిల్ సమీక్ష కమిటీ సూచించినట్లుగా సీడీఎస్​ను కార్యాచరణ బాధ్యతలకు దూరంగా ఉంచుతారా? ఈ కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. "
-మన్మోహన్ బహదూర్, వాయుసేన మాజీ అధికారి

ఇదీ చూడండి: మోదీ 2.0: 'త్రివిధ దళాలకు ఉమ్మడి సారథి'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 3:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.