రాబర్ట్ వాద్రా ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌పై విచారించింది దిల్లీ హైకోర్టు. ఈడీ పిటిషన్‌పై స్పందించాలని వాద్రాకు జస్టిస్ చందర్శేఖర్ నోటీసులు జారీ చేశారు.
హవాలా కేసులో రాబర్ట్ వాద్రాకు ఏప్రిల్ 1న కిందికోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... ఈడీ పిటిషన్‌పై సమాధానమివ్వాలని వాద్రాను ఆదేశించింది. కేసుతో సంబంధముందని ఆరోపణలెదుర్కొంటున్న వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరానూ స్పందించాలని కోరింది.
ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రాబర్ట్ వాద్రా ఈ కేసు విచారణకు సహకరించని కారణంగా ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు. నేరానికి సంబంధించిన మౌలిక అంశాలను కింది కోర్టు విచారించలేదని ఈడీ తరఫున వాదించారు.
వాద్రా బావమరిది, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హవాలా సొమ్ముతో లండన్‌లో ఆస్తి కొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చూడండి: జూన్ 6-15 వరకు 17వ లోక్‌సభ తొలి సమావేశం!