కరోనాకు వ్యాక్సిన్ తీర్చిదిద్ది, వాటిని అత్యవసరంగా వాడేందుకు రెండు సంస్థలు అనుమతి పొందడం భారతదేశ శాస్త్ర పురోగతికి నిదర్శనమని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రెండు సంస్థల వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంపై సోమవారం ఆయన ఫేస్బుక్ ద్వారా స్పందించారు.
"అత్మనిర్భర్ భారత్‌లో భారతీయులకే కాకుండా ప్రపంచంలో అందరికీ లబ్ధి కలుగుతుందనడానికి ఇదొక నిదర్శన. కరోనాకు కళ్లెం వేయడానికి ఎలా పనిచేశామో అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రజల వద్దకు వ్యాక్సిన్‌ను చేర్చాలి. ఈ విజయానికి కారకులైన అందరినీ అభినందించాలి" అని చెప్పారు.
ఇదీ చదవండి:టీకా కోసం ఈ వారమే భారత్ బయోటెక్‌తో ఒప్పందం