10ఏళ్ల బాలికను ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. చివరికి అతడికి ఇచ్చే.. ఆ చిన్నారి వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. కొన్ని నెలల అనంతరం.. ఆ మైనర్‌కు ముమ్మారు తలాక్ చెప్పి, తన ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. ఈ అమానవీయ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది.
ఇలా బయటపడింది...
కొన్ని నెలల క్రితం.. 10ఏళ్ల బాలికపై ఆమె సోదరి బావ అత్యాచారం చేశాడు. ఈ ఘటన జరిగిన అనంతరం.. ఈ ఏడాది ఫ్రిబవరి 16న అతడికిచ్చే ఆ బాలిక వివాహం జరిపించారు కుటుంబసభ్యులు.
తాజాగా.. ఈ నెల 4వ తేదీన ఆ మైనర్‌ను తన ఇంట్లో వదిలి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. దీంతో చైల్డ్ కేర్ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించారు ఆ చిన్నారి కుటుంబసభ్యులు. ఈ నెల 6వ తేదీన బుధాన్ వెళ్లిన హెల్ప్‌లైన్ బృందం.. ఈ పూర్తి వ్యవహారం తెలుసుకుని షాక్‌కు గురైంది. అతడు ఆ మైనర్‌కు ముమ్మారు తలాక్ చెప్పినట్టు అప్పుడే తెలుసుకున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు బుధాన పోలీస్‌స్టేషన్ అధికారి కేపీ సింగ్ వెల్లడించారు.
అయితే సోదరి ప్రోద్బలంతోనే తండ్రి ఆ చిన్నారిని ఆ వ్యక్తికిచ్చి పెళ్లి జరిపించినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: విషం తాగినా పట్టించుకోని ఆసుపత్రులు