ETV Bharat / bharat

యూపీలో కరోనా తీవ్రరూపం- ఒక్కరోజే 4,658 కేసులు

యూపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 4,658 మందికి వైరస్ సోకింది. దిల్లీ, కేరళలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

author img

By

Published : Aug 6, 2020, 7:08 PM IST

Uttar Pradesh reported 4,658 new COVID-19 cases and  63 death
ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా ఉగ్రరూపం... 4 వేల మందికి పైగా వైరస్​

భారత్​లో కొవిడ్​ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా.. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లోనూ రోజుకు 4 వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​లో ఉగ్రరూపం..

ఉత్తర్​ప్రదేశ్​లో రికార్డు స్థాయిలో వైరస్​ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 4,658 మందికి వైరస్​ సోకింది. మరో 64 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య లక్ష దాటింది. మృతుల సంఖ్య 1,918కు పెరిగింది.

దిల్లీ..

దిల్లీలో తాజాగా 1,299 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 15 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1,41,531కు చేరింది. మరణాల సంఖ్య 4,059కు పెరిగింది.

రోజూ వెయ్యికిపైనే..

కేరళలో రోజూ వెయ్యికిపైనే కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా 1,298మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 97కు ఎగబాకింది.

ఇదీ చూడండి: 'కరోనా రోగులపై పని చేయని ప్లాస్మా చికిత్స'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.