ETV Bharat / bharat

యూపీలో తప్పిపోయాడు.. పదేళ్ల తర్వాత ఇంటికి చేరాడు - యూపీ మిస్సింగ్​ కేసు

పదేళ్ల క్రితం తప్పిపోయిన ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తిని తాజాగా రాజస్థాన్​లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడిని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

Uttar Pradesh man missing for ten years found in Rajasthan
పదేళ్ల క్రితం యూపీలో తప్పిపోయి.. రాజస్థాన్​లో​ ప్రత్యక్షమై!
author img

By

Published : Aug 29, 2020, 11:44 AM IST

పదేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని తిరిగి ఇంటికి చేర్చారు రాజస్థాన్​​ పోలీసులు. ఉత్తర్​ప్రదేశ్​లో కనిపించకుండా పోయిన కొడుకును చాలా ఏళ్ల తర్వాత చూసిన ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.

Uttar Pradesh man missing for ten years found in Rajasthan
ప్రేమ్​ సింగ్​

ఇదీ జరిగింది..

ప్రేమ్​ సింగ్​ అనే 14 ఏళ్ల బాలుడు పదేళ్ల క్రితం హరిద్వార్ బస్​స్టేష్​లో అనుకోకుండా తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు. అక్కడి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ రాజస్థాన్​​ ఝావర్​ బస్​స్టాండ్​కు చేరుకున్నాడు. కొంతకాలంగా అక్కడే జీవనం సాగిస్తున్నాడు.

కొన్ని రోజుల నుంచి ప్రేమ్​ను గమనిస్తున్న అదే గ్రామానికి చెందిన వ్యక్తి అతని దగ్గరకు వెళ్లి ఆచూకీ అడిగాడు. తన పూర్తి వివరాలను తెలిపాడు. వెంటనే ఆ గ్రామస్థుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు ఉత్తర్​ప్రదేశ్​లోని పోలీసులకు సమాచారం ఇచ్చి.. తల్లిదండ్రులను సంప్రదించారు. అనంతరం ప్రేమ్​ను వారికి అప్పగించినట్లు రాజస్థాన్​​ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ప్రపంచ గిన్నిస్ రికార్డుల్లో​ అరుదైన 'పెళ్లి పుస్తకం'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.