ETV Bharat / bharat

భారత్​- చైనా సైనికాధికారుల భేటీలో కీలక అంశాలివే! - భారత్​ చైనా సరిహద్దు వివాదం

భారత్​- చైనా మధ్య ఉన్నత స్థాయి సైన్యాధికారుల సమావేశం శనివారం జరగనుంది. ఈ భేటీలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు సంబంధించి ప్రధానంగా చర్చించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో భద్రతా బలగాల స్థానాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరగవచ్చని తెలుస్తోంది.

India-China military meet
భారత్​- చైనా సైనికాధికారుల భేటీ
author img

By

Published : Jun 5, 2020, 6:28 AM IST

భారత్​- చైనా మధ్య శనివారం జరిగే ఉన్నతస్థాయి సైనికాధికారుల సమావేశంలో సైనికుల మధ్య ఘర్షణే ప్రధాన అజెండా కానుందని విశ్వసనీయవర్గాల సమాచారం. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల ఘర్షణలో 100 మందికిపైగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరి ఆరోగ్య పరిస్థితి అంశాన్ని ఈ భేటీలో భారత ప్రతినిధుల బృందం లేవనెత్తనుందని సమాచారం.

తూర్పు లద్ధాఖ్​లోని పాంగోంగ్​ సో సరస్సు వద్ద మే 5,6 తేదీల్లో భారత జవాన్లు, చైనా పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇరుదేశాల సైనికులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. రాళ్లు విసిరారు, పదునైన ఇనుప వస్తువులతో దాడి చేసినట్లు ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.

"పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేయటం అసాధారణ చర్య. దీన్ని ఆమోదించే ప్రసక్తే లేదు. భారత్​- చైనా మధ్య శనివారం జరిగే సైనిక అధికారుల భేటీలో దీని ప్రస్తావన తప్పకవస్తుంది. సైనికులందరూ లద్ధాఖ్​లోనే చికిత్స తీసుకున్నారు. కొంతమందికి గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి."

- సీనియర్​ సైనికాధికారి

మరోవైపు.. గాల్వన్​ లోయలో ఇరువైపుల సైన్యం ఒక కిలోమీటర్​ వెనక్కి జరిగినట్లు తెలుస్తోంది. వివాదమేమీ లేనప్పటికీ సమావేశానికి ముందు ఈ చర్య కీలకాంశంగా మారింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపేందుకు సంకేతంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇతర కీలకాంశాలు..

  • ఇరువైపులా ఘర్షణల పూర్వస్థితికి బలగాల స్థానాన్ని మార్చటం
  • ముఖాముఖి స్థావరాల వెనుకభాగంగా ఏర్పాటు చేసిన అదనపు బలగాలను తొలగించటం
  • భారీ వాహనాలు, ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లటం

ఎవరెవరు వెళ్తారంటే..

భారత్​ తరఫున 14 కార్ప్స్​ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​ హరీందర్ సింగ్, పాంగోంగ్ సో, దౌలత్ బేగ్​ ఓల్డీ ప్రాంతాల బ్రిగేడ్​ కమాండర్లు, స్థానిక బలగాల కల్నళ్లతో పాటు ఒక ట్రాన్స్​లేటర్ ​(అనువాదం చేసే వ్యక్తి) ఉంటారు.

ఇదీ చూడండి: సరిహద్దులో చైనా దూకుడుకు కారణం ఇదేనా?

అనూహ్య భేటీ..

వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో అరుదైన రీతిలో ఉన్నతాధికారుల భేటీకి సిద్ధమయ్యాయి భారత్​, చైనా. ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థలైన భారత్, చైనా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు శనివారం భేటీ కానున్నారు. ఈ సమావేశం చైనాలోని చూశూల్​లో జరగనుంది. ఇది తూర్పు లద్దాఖ్​లోని స్పాంగుర్​ సమీపంలో ఉంటుంది.

భారత్​- చైనా మధ్య 2013 అక్టోబర్​లో సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం (బీడీసీఏ) కుదిరింది. దీని ప్రకారం ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు మిలిటరీ థియేటర్లను పరస్పరం సందర్శిస్తారు. ఇప్పటివరకు ఇదే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. మునుపు ఎన్నడూ లేనివిధంగా లెఫ్టినెంట్​ జనరల్ స్థాయి అధికారులు పాల్గొనే ఈ భేటీలో సరిహద్దు వివాదంలో పూర్తి పరిష్కారంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

యంత్రాంగాల ప్రకారం..

3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో వివాదాల పరిష్కారానికి విశ్వసనీయత పెంపు చర్యలు (సీబీఎం) కింద 5 సూత్రాల అమలుకు రెండు దేశాలు అంగీకరించాయి. ఘర్షణలను తగ్గించేందుకు బీడీసీఏ కింద ఇప్పటివరకు అనేక సీబీఎం యంత్రాంగాలను అమలు చేశారు. కమాండర్లు, ప్రభుత్వ అధికారుల మధ్య పతాక సమావేశాలు నిర్వహించారు.

ఇదీ చూడండి: సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్​-చైనా రెడీ

భారత్- చైనా సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి సంప్రదింపులు, సహకారం కోసం కార్యాచరణ యంత్రాంగం (డబ్ల్యూఎంసీసీ) రూపొందించారు. ఇది సంయుక్త కార్యదర్శి, సరిహద్దు వ్యవహారాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో జరుగుతుంది. వార్షిక రక్షణ చర్చలు మాత్రం రక్షణ శాఖ కార్యదర్శి స్థాయిలో జరుగుతాయి.

(రచయిత- సంజీవ్​ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.