బాలీవుడ్ నటి ఊర్మిళ మాతోండ్కర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైంది. ఉత్తర ముంబయి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
రంగీలా చిత్రంతో అందరికీ సుపరిచితురాలైన ఊర్మిళ... బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు.
ఎప్పటి నుంచో ముంబయిలోనే నివసిస్తున్నారు ఊర్మిళ. నగరంలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారా అని నిన్న ఈటీవీ భారత్ అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేసింది.