ETV Bharat / bharat

సివిల్స్​ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల మార్పునకు ఓకే - civil services prelims EXAMS NEWS

సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ​ పరీక్ష కేంద్రాల మార్పునకు అనుమతించింది యూపీఎస్​సీ. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 7 తర్వాత యూపీఎస్​సీ వెబ్​సైట్​ ద్వారా మార్చుకోవాలని సూచించింది.

UPSC
సివిల్స్​ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల మార్పునకు ఓకే
author img

By

Published : Jul 1, 2020, 4:41 PM IST

అక్టోబర్ 4న జరిగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలు మార్చుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్​సీ) అవకాశం కల్పించింది. కరోనా కారణంగా తమ పరీక్ష కేంద్రాలు మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ.. పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్‌తో పాటు ఐఎఫ్​ఎస్​ మెయిన్స్ పరీక్షల కేంద్రాలూ మార్చుకునేందుకూ అవకాశం ఉంటుందని తెలిపింది యూపీఎస్​సీ.

రెండు దశల్లో..

పరీక్షా కేంద్రం మార్పు ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని తెలిపింది కమిషన్​. తొలి దశ జులై 7 నుంచి 13 సాయంత్రం 6 గంటల వరకు, రెండో దశ జులై 20 నుంచి 24 సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. upsconline.nic.in లోకి వెళ్లి మార్చుకోవాలని సూచించింది.

వారికే తొలి ప్రాధాన్యం..

సదరు పరీక్షా కేంద్రాల్లో అవకాశాలను బట్టి.. ఆ కేంద్రాన్ని కేటాయిస్తామని కమిషన్ వివరించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ వారు కోరుకున్న కేంద్రం కేటాయించేందుకు సీలింగ్ కారణంగా కుదరకుంటే మరో పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చని తెలిపింది.

ఇదీ చూడండి: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.