ETV Bharat / bharat

50మంది పిల్లలపై లైంగిక దాడి - ప్రభుత్వ ఇంజినీర్ అరెస్టు - up engineer arrested in sex abuse case

ఉత్తర్​ప్రదేశ్​ నీటి పారుదల విభాగంలోని ఓ జూనియర్ ఇంజినీర్​ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 5-16 మధ్య వయసు పిల్లలపై లైంగిక దాడి చేస్తున్నాడని అతని మీద ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 50మంది పిల్లలు ఈ ఇంజినీర్​ వల్ల బాధితులుగా మారినట్లు అధికారులు తెలిపారు.

up engineer
ప్రభుత్వ ఇంజినీర్ అరెస్టు
author img

By

Published : Nov 17, 2020, 7:20 PM IST

Updated : Nov 17, 2020, 7:45 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో 5నుంచి 16 ఏళ్ల పిల్లలపై లైంగిక దాడి చేస్తున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జూనియర్ ఇంజినీర్‌ను సీబీఐ అధికారులు ‌అరెస్ట్ చేశారు. యూపీ నీటిపారుదల విభాగంలో పనిచేస్తున్న ఇంజినీర్‌... గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న పలు ప్రాంతాల్లో చిన్నారులను లైంగికంగా హింసించాడని అధికారులు తెలిపారు.

చిత్రకోట్‌, బాంద, హమీర్‌పుర్‌లో దాదాపు 50 మంది పిల్లలు ఇంజినీర్‌ వల్ల బాధితులుగా మారినట్లు వివరించారు. అతడి ఆఫీస్‌ నుంచి పెద్దఎత్తున పిల్లలతో అసభ్యంగా చిత్రీకరించిన వీడియోలతో పాటు, రూ.8 లక్షల నగదు, 8 మొబైల్‌ ఫోన్లు, ఒక ల్యాప్‌ టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

డార్క్​నెట్​లో..

ఇలా పిల్లలతో అసభ్యంగా చిత్రీకరించిన వీడియోలను డార్క్​నెట్‌లో ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. తన దగ్గరకు వచ్చిన చిన్నపిల్లలకు మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఆట వస్తువులను ఆశ చూపి వారిపట్ల లైంగిక అకృత్యాలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఐదు మృతదేహాలు

Last Updated : Nov 17, 2020, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.