ETV Bharat / bharat

ఛాయ్​తో 'పోలీస్'​ సమస్యలను దూరం చేస్తున్న ఎస్పీ - national news in telugu

ప్రజల భద్రత కోసం రాత్రిళ్లు గస్తీ నిర్వహించే పోలీసులకు ప్రోత్సాహం అందిస్తున్నారు ఉత్తర్​ప్రదేశ్​ హర్దోయి ఎస్పీ. రాత్రివేళల్లో విధులు నిర్వహిస్తున్నవారికి ఛాయ్​, బిస్కట్లు అందించి వారి సమస్యలను తెలుసుకోవాలని ఏర్పాట్లు చేశారు. ఆయన ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.

up hardoi sp started midnight meal for patrolling police
author img

By

Published : Oct 12, 2019, 8:37 PM IST

ఛాయ్​తో 'పోలీస్'​ సమస్యలను దూరం చేస్తున్న ఎస్పీ

ఉత్తర్​ప్రదేశ్​ హర్దోయి జిల్లా ఎస్పీ ఆలోక్​ ప్రియదర్శి.. ప్రజల భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఓ సరికొత్త ఆలోచనతో ముందుకువచ్చారు. ఇందుకు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తే పోలీసులకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఆ ఆలోచనను ఆచరణలో పెడుతూ.. జిల్లాలో గస్తీ పోలీసులకు రాత్రివేళ ఛాయ్​, బిస్కట్లు అందించేలా ఏర్పాటు చేశారు. వీటన్నింటిని సరఫరా చేయాలని అన్ని ఠాణా ఇన్​ఛార్జులు, గెజిటెడ్​ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

"దీనివల్ల మూడు లాభాలు ఉన్నాయి. గస్తీ చేసే వాళ్లకు తినడానికి, తాగడానికి ఏమీ దొరకవు. వాళ్లు సాయంత్రం వచ్చి ఉదయం వెళతారు. ఆ పరిస్థితుల్లో వాళ్లేమైనా తినగలిగితే ఉదయం వరకు ఉత్సాహంగా ఉండగలుగుతారు. రెండోది.. గస్తీలో ఉన్నవారికి మా అధికారులే ఆహారం అందిస్తారు. అలా వెళ్లినప్పుడు తనిఖీలు చేస్తారు. ఎవరు ఏం చేస్తున్నారనే విషయం వారికి తెలుస్తుంది. గస్తీలో ఉన్నవారు అప్రమత్తంగా ఉంటారు. దీనివల్ల పోలీసులకు, తనిఖీ అధికారులకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారికి సహాయం లభిస్తుంది. ఇలా పోలీసు శాఖలో మంచి వాతావరణం ఏర్పడుతుంది."

-ఆలోక్​ ప్రియదర్శి, హర్దోయి ఎస్పీ

ఎస్పీ ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. పోలీసులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఉన్నతాధికారులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతోందని.. వారితో తమ సమస్యలు విన్నవించుకునే అవకాశం ఏర్పడిందంటున్నారు.

"మా అధికారులు మాకోసం ఛాయ్​ తీసుకొనివస్తారు. మా సమస్యలు అడిగి మాకు ఛాయ్​ అందిస్తారు. బిస్కట్లు ఇస్తారు. మేం చెప్పిన సమస్యలపై దృష్టి పెడతారు. ఇది మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. మాకు అధికారుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతోంది."

- గస్తీ పోలీసు

ఇదీ చూడండి: ట్రాఫిక్​ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding China, Belgium, Germany and the Netherlands. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: 12th October 2019. Huzhou - Changxing, Taihu, China.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION: 02:21
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.