నకలీ పత్రాలతో ప్రభుత్వ టీచర్లుగా చలామణి అయిన 10 మంది టీచర్లకు చెల్లించిన జీతం, ఇతర అలవెన్స్‌ను తిరిగి పొందేలా చర్యలు ప్రారంభించింది యూపీ ప్రభుత్వం. మొత్తం 2.36 కోట్ల రూపాయలను చెల్లించాలంటూ వారికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
10మంది ఉపాధ్యాయుల్లో ఆరుగురు సరస్వతి జిల్లాకు చెందిన వారు కాగా.. మరో నలుగురు బహ్రాయిచ్ జిల్లా వారని అధికారులు వెల్లడించారు.
నకిలీ పత్రాలను సృష్టించి ఉద్యోగం పొందినట్లు గుర్తించిన ఆరుగురు ఉపాధ్యాయులను గత సంవత్సరమే తొలగించాం. వీరిపై ఎఫ్ఆర్ఐ కూడా నమోదు చేశాం. ఈ ఆరుగురిలో ఒకరైన అజిత్ శుక్లా.. టెట్‌కు చెందిన నకిలీ పత్రాలను సృష్టించి ఉద్యోగం సంపాదించినట్లు గుర్తించాం. దీంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశాం. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారు.
-ఓంకార్ రానా, అధికారి
వీరిలో ఆరుగురికి ..జీతం, ఇతర అలవెన్స్‌ల ద్వారా పొందిన 1.37 కోట్ల రూపాయలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసులు పంపించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని జూన్ 20 నాటి కల్లా చెల్లించాలని.. లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మిగిలిన నలుగురు ఉపాధ్యాయులు కూడా నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగం పొందినట్లు 2018లోనే గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరికి కూడా రూ.95 లక్షల రూపాయాలను చెల్లించాలని నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:మిడతల దండు దాడి చేసినా.. పంట నష్టం జరగలేదు!