హాథ్రస్ ఘటనపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక గడువును యూపీ సర్కారు పొడిగించింది. నివేదిక సమర్పించడానికి మరో 10 రోజులు సమయమిస్తూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ హోం శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ కుమార్ తెలిపారు. ఘటనపై సిట్ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, అందుకే గడువును పొడిగిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తొలుత 7రోజులు..
సెప్టెంబర్ 14న హాథ్రస్‌లో జరిగిన హత్యాచార ఘటనపై దర్యాప్తు చేయడానికి యూపీ సర్కారు సెప్టెంబర్ 30న సిట్‌ను ఏర్పాటు చేసింది. 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ గడువు బుధవారంతో పూర్తవుతోంది. అయితే ఇంకా దర్యాప్తు పూర్తికానందున మరో 10 రోజులు గడువు పొడిగించింది.
ఇదీ చూడండి: