ETV Bharat / bharat

అన్​లాక్​-5.0: ఈ నెల 15 నుంచి 'వినోదం' - సినిమాహాళ్లు

అన్​లాక్​ 5.0 మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో సినిమా థియేటర్లకు ఈ నెల 15 నుంచి అనుమతినిచ్చింది. వినోద పార్కులూ తెరవొచ్చని స్పష్టం చేసింది. పాఠశాలలపై 15 తర్వాత రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

Unlock 5.0: Cinema halls allowed to operate with 50% capacity from Oct 15
అన్​లాక్​-5: ఈ నెల 15 నుంచి 'వినోదం'
author img

By

Published : Oct 1, 2020, 5:31 AM IST

సినిమా ప్రియులకు శుభవార్త. అక్టోబర్‌ 15 నుంచి కంటెయిన్‌మెంట్‌ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను 50% సీటింగ్‌ సామర్థ్యంతో ప్రారంభించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పాఠశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్‌ కేంద్రాల పునఃప్రారంభంపై ఈ నెల 15 తర్వాత నిర్ణయం తీసుకొనే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించింది. వినోద పార్కులు, ఆ కోవలోకి వచ్చే ఇతర స్థలాలనూ 15 నుంచి తెరచుకోవచ్చు. బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ఎగ్జిబిషన్లూ ప్రారంభించుకోవచ్చు. క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే ఈత కొలనులకూ పచ్చజెండా ఊపింది. సభలు, సమావేశాల్లో 100 మందికి మించి పాల్గొనకూడదని ప్రస్తుతం ఉన్న గరిష్ఠ పరిమితి పెంచుకొనే స్వేచ్ఛనూ రాష్ట్రాలకే ఇచ్చింది. కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయటమరిన్ని కార్యక్రమాలకూ అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్రహోంశాఖ బుధవారం అన్‌లాక్‌-5 మార్గదర్శకాలువిడుదల చేసింది.

క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసిన తర్వాత విద్యాసంస్థల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలి. ఆన్‌లైన్‌/దూరవిద్యా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైనంతమేరకు దాన్ని ప్రోత్సహించాలి.
* పాఠశాలలు తెరిచిన తర్వాతా ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగి.. విద్యార్థులు వాటికి హాజరుకావడానికే ప్రాధాన్యం ఇస్తే వారికి అనుమతివ్వాలి.
* తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలి.
* హాజరును తప్పనిసరి చేయకూడదు. ఈ విషయంలో పూర్తిగా తల్లిదండ్రుల అనుమతి మేరకే నడచుకోవాలి.
* కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల ప్రారంభ తేదీలపై హోంశాఖతో సంప్రదించి నిర్ణయించాలి.
* పరిశోధక విద్యార్థులను, ప్రయోగశాలతో పని ఉండే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పీజీ విద్యార్థులను ఉన్నత విద్యాసంస్థలు అక్టోబర్‌ 15 నుంచి అనుమతించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థల విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు.

జన సమూహంపై ఆంక్షలు

అన్నివైపులా మూసి ఉండే సమావేశ మందిరాల్లో గరిష్ఠ సామర్థ్యంలో 50% వరకే అనుమతిస్తారు. అది కూడా 200 మందికి మించకూడదు. మాస్కులు, భౌతిక దూరం, థర్మల్‌ స్కానింగ్‌ తప్పనిసరి.
* బహిరంగ స్థలాల్లో అయితే మైదానం వైశాల్యాన్ని దృష్టిలో ఉంచుకొని జనాన్ని అనుమతించాలి.
* ఇలాంటి సమూహాల ద్వారా కొవిడ్‌-19 వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు జారీ చేయాలి. వాటిని కఠినంగా అమలుచేయాలి.
* కంటెయిన్‌మెంట్‌ జోన్లలో అక్టోబర్‌ 31వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది.
* కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించకూడదు.
* రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో అంతర్గతంగా వ్యక్తులు, వాహనాలు, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదు.

అంతర్జాతీయ విమానాలు రద్దు

అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం అక్టోబరు 31 వరకు కొనసాగుతుంది. అయితే ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో మాత్రం విమానాలను అనుమతించే అవకాశం ఉందని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.