అన్‌లాక్-4 సడలింపులతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా పాఠశాలలు ప్రారంభించారు. కరోనా కట్టడి నిబంధనలతో పాక్షికంగా పాఠశాలలు తెరిచారు. ఉపాధ్యాయుల మార్గదర్శకాలతో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థుల వరకు మాత్రమే స్వచ్ఛందంగా హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. పాఠశాలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుని అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే దిల్లీ, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్,కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికీ విద్యాలయాలు తెరవలేదు.
పాటించాల్సిన నిబంధనలు..
- కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం.
- తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
- తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
- హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించాలి.
- దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ముక్కు, ముఖానికి చేతి రుమాలు లేదా మోచేయి అడ్డం పెట్టుకోవాలి.
- పాఠశాల ఆవరణలో ఉమ్మడం నిషేధం.
- ఒంటిలో నలతగా ఉంటే ఎవరికివారే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా నేటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం