ETV Bharat / bharat

అన్‌లాక్‌ 3.0: ఆంక్షల 'తెర' తొలగుతోంది! - Unlock 3.0: Removing the 'screen' of lockdown restrictions in india

దేశంలో విధించిన లాక్​డౌన్​ను కేంద్రం దశలవారీగా తొలగిస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 1 నుంచి అన్​లాక్​ 3.0 ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు తెరచుకోనున్నట్లు సమాచారం. పాఠశాలలు, మెట్రో రైళ్ల మూసివేత యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని సడలింపులపై కేంద్రం కసరత్తు చేస్తోంది.

Unlock 3.0: Removing the 'screen' of lockdown restrictions in india
అన్‌లాక్‌ 3.0: ఆంక్షల 'తెర' తొలగుతోంది!
author img

By

Published : Jul 27, 2020, 5:36 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన దేశంలో దశలవారీగా కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే అన్‌లాక్‌-1, అన్‌లాక్‌-2లలో పలు ఆంక్షలను సడలించిన కేంద్రం.. వచ్చే నెల ఒకటి నుంచి మొదలయ్యే అన్‌లాక్‌-3పై దృష్టిపెట్టింది. జులై 31తో అన్‌లాక్‌ 2.0 ముగియనున్న నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి అన్‌లాక్‌ 3.0కు మార్గదర్శకాలు రూపొందించడంలో సంబంధిత వర్గాలు తీరికలేకుండా ఉన్నాయి. ఇందులో భాగంగా మరిన్ని సడలింపులపై కేంద్రం కసరత్తు చేస్తోంది.

ఈ క్రమంలోనే ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు తెరచుకోనున్నట్లు అధికారవర్గాల సమాచారం. సినిమా థియేటర్లలో ప్రామాణిక నిర్వహణ విధానం (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌- ఎస్‌వోపీ) పాటిస్తూ సామాజిక దూరం ఉండేలా చూడనున్నారు. ఈ విషయమై ఇప్పటికే యాజమాన్యాలతో సంప్రదించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ.. కేంద్ర హోంశాఖకు ఓ ప్రతిపాదన పంపినట్లు తెలిసింది. మరోవైపు, 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు తెరవడానికి యజమానులు అనుకూలంగా ఉండగా, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మాత్రం తొలుత 25 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు తెరవాలని, భౌతిక దూరం అనుసరించాలని సూచించింది.

  • పాఠశాలలు, మెట్రో సేవలు మూసే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పరిస్థితుల మేరకు సొంత మార్గదర్శకాలు నిర్ణయించుకునే అధికారం కూడా రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది.
  • పాఠశాలలను తిరిగి తెరవడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రారంభించింది. ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులతో కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ మాట్లాడగా.. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలను తిరిగి తెరవాలనే ప్రతిపాదనను ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు వ్యతిరేకించారని మంత్రిత్వశాఖ పేర్కొంది.

For All Latest Updates

TAGGED:

news
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.