ETV Bharat / bharat

'కరోనా లక్షణాలున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు' - భారతదేశంలో కరోనా వైరస్

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1071కి చేరగా.. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 29కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 99 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. 942 మందికి.. దేశంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

Union Health Ministry briefing about Covid-19 cases
'కరోనా లక్షణాలున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు'
author img

By

Published : Mar 30, 2020, 5:45 PM IST

Updated : Mar 30, 2020, 6:10 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో మరో 92 కొవిడ్​-19 కేసులు నమోదవగా.. నలుగురు మృతి చెందినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఫలితంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,071కు చేరినట్లు తెలిపింది. మృతుల సంఖ్య 29కి చేరిందని ప్రకటించింది.

దేశంలో కరోనా మహమ్మారి ఇప్పటికీ లోకల్ ట్రాన్స్​మిషన్​ స్టేజ్​లోనే ఉందని.. కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్​ స్టేజ్​కి చేరుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్​ కుమార్​ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే.. సామాజిక దూరం తప్పక పాటించాలన్న ఆయన.. ఒక్కరు నిర్లక్ష్యం చేసినా.. ఈ మహమ్మారి దేశం మొత్తం వ్యాపించే అవకాశముందని హెచ్చరించారు.

"మనదేశంలో జనసాంద్రత ఎక్కువ. ప్రతిఒక్కరూ భౌతిక దూరంతో పాటు వందశాతం ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. ఒక వ్యక్తి ద్వారా అనేకమందికి వైరస్ సోకుతోంది. భౌతిక దూరం పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా లక్షణాలున్నప్పటికీ భయాందోళనలు అవసరం లేదు. ఏమాత్రం అనుమానం ఉన్నా కాల్‌సెంటర్లను సంప్రదించండి. అద్దెకు ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టొద్దు."

- కేంద్ర ఆరోగ్యశాఖ

ఇప్పటివరకు 38,442 మందికి పరీక్షలు

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 38,442 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది ఇండియన్​ కౌన్సిల్ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​). ఇందులో ఆదివారం ఒక్కరోజే 3,501 మంది నమూనాలు పరీక్షించినట్లు తెలిపింది. ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ గత 3 రోజుల్లో 1,334 మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించింది ఐసీఎంఆర్​. ప్రస్తుతమున్న 115 ల్యాబ్‌లకు అదనంగా మరో 47 ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

రాష్ట్రాలవారీగా ఇలా..

  • కొవిడ్‌-19 కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్రలో కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా అక్కడ బాధితుల సంఖ్య 215కు చేరింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 9మంది కరోనాకు బలయ్యారు.
  • కేరళలో ఇవాళ మరో 30 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కొవిడ్​-19 సోకినవారి సంఖ్య 213కు చేరింది.
  • పశ్చిమ బంగాలో 54ఏళ్ల మహిళ మృతి చెందినందున అక్కడ కోవిడ్‌-19 మృతుల సంఖ్య రెండుకు చేరింది.
  • మధ్యప్రదేశ్‌లో ఇదివరకే చనిపోయిన 65 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్​గా వచ్చింది. దీంతో మొత్తం కేసులు 47కు చేరగా మృతుల సంఖ్య.. 3కు చేరింది.
  • మొహలీలో 65 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినందున పంజాబ్‌లో కేసులు 39కి చేరాయి.
  • గుజరాత్‌లో భావ్‌నగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ ఇవాళ వైరస్‌తో కన్నుమూసింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరో ఆరుగురికి వైరస్ ఉన్నట్లు తేలినందున.. బాధితుల సంఖ‌్య 69కి చేరింది.
  • రాజస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 69కి చేరింది. ఇరాన్ నుంచి తీసుకొచ్చి జోధ్‌పుర్ శిబిరంలో ఉంచిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని రాజస్థాన్‌ అధికారులు తెలిపారు.
  • తమిళనాడులో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 67కు చేరిందని... ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు.
  • అండమాన్ నికోబార్ దీవుల్లో మరొకరికి వైరస్ సోకినట్లు తేలడంతో.. అక్కడ కేసుల సంఖ్య పదికి చేరింది.
  • జమ్ముకశ్మీర్‌లో.. కొత్తగా ఏడుగురికి వైరస్ ఉన్నట్లు తేలింది. దీనివల్ల అక్కడ మొత్తం కేసుల సంఖ్య 45కు పెరిగింది.
  • ఉత్తర్​ప్రదేశ్​ నొయిడాలోని గౌతమ్​ బుద్ధ నగర్​లో మరో నలుగురికి కరోనా పాజిటివ్​గా సోకింది. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 మందికి కరోనా సోకినందున యూపీలో కొవిడ్​-19 బాధితుల సంఖ్య 88కి చేరింది.

Last Updated : Mar 30, 2020, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.