విద్యా సంవత్సరంలో కనీసం పది రోజులు.. బడి సంచి లేకుండా పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా.. 'నో స్కూల్ బ్యాగ్ డే' అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. బడి సంచి బరువు తక్కువగా ఉండాలని.. నూతన స్కూల్ బ్యాగ్ విధానం-2020ని కేంద్ర విద్యాశాఖ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో దాని అమలుకు చర్యలు తీసుకుని నివేదిక పంపాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు తాజాగా లేఖలు రాసింది.
'నో స్కూల్ బ్యాగ్ డే' రోజుల్లో విద్యార్థులకు క్విజ్, ఆటలు, పాటల పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించింది. ప్రతి మూడు నెలలకొకసారి బడిసంచులు తూకం వేసేందుకు వీలుగా పాఠశాలల్లో డిజిటల్ తూకం యంత్రం సమకూర్చుకోవాలని తెలిపింది. అవసరం లేని వస్తువులు పంపవద్దని తల్లిదండ్రులుకు చెప్పాలని సూచించింది. సంచి బరువుపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.
ఇదీ చూడండి:శిరస్త్రాణం లేకుంటే పెట్రోల్ బంద్