కర్ణాటక బెంగళూరు సమీపంలోని యశ్వంత్‌పురలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణదశలో ఉన్న ఓ భవనం కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు.
ఉదయం 4.40 గంటలకు ప్రమాదం జరిగింది. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వీరిని రక్షించడానికి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల్ని బంగాల్‌కు చెందిన రాహుల్, బిహార్‌కు చెందిన రాకేశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఛత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో నక్సల్స్ హతం!