ETV Bharat / bharat

ఐరాసలో పాక్​ 'కశ్మీర్​' ప్రస్తావనపై భారత్​ ఫైర్​ - ఐరాస సర్వసభ్య సమావేశాలు

ఐరాస వేదికగా కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్​పై మండిపడింది భారత్​. కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావించిన ఆ దేశ విదేశాంగమంత్రి మహమూద్​ ఖురేషీ తీరును తప్పుబట్టింది. భారత అంతర్గత వ్యవహారాలపై పాక్​ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలే చేస్తుందని విమర్శించింది.

UN75: India slams Pakistan for raising J-K issue
ఐరాసలో పాక్​ 'కశ్మీర్​' ప్రసంగంపై భారత్​ ఫైర్​
author img

By

Published : Sep 22, 2020, 11:15 AM IST

ఐరాస 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో.. కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్​పై తీవ్రస్థాయిలో మండిపడింది భారత్​. ఉగ్రవాదానికి అడ్డాగా పాక్​ మారిందన్న విషయం ప్రపంచ దేశాలకు తెలుసని.. ఉగ్రవాదులను అమరులుగా ఆ దేశం అభివర్ణిస్తుందని విమర్శించింది.

కశ్మీర్​పై పాక్​ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చేసిన ప్రసంగాన్ని ఐరాసలోని భారత ప్రధాన కార్యదర్శి విదిష మైత్రా తప్పుబట్టారు. భారత అంతర్గత విషయమైన కశ్మీర్​పై పాక్​ ఎప్పుడూ కల్పిత కథలను చెబుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు.

"రైట్​ టు రిప్లై ఆధారంగా పాకిస్థాన్​ కథనాలను భారత్​ ఖండిస్తోంది. ఐరాస ఓ కీలక మైలురాయిని చేరుకుంది. దీనిని దృష్టిలో పెట్టుకునైనా.. నిరాధారమైన అబద్ధాలను చెప్పడం పాకిస్థాన్​ పక్కనపెడుతుందని భారత్​ ఆశించింది. కానీ.. ఇలాంటి గొప్ప మైలురాయిని పాక్​ పక్కనబెట్టింది. భారత అంతర్గత వ్యవహారాలపై పాకిస్థాన్​ ఎప్పుడూ కల్పిత కథలే చెబుతూ ఉంటుంది."

--- విదిష మైత్రా, ఐరాసలోని భారత ప్రధాన కార్యదర్శి.

ఇదీ చూడండి:- కశ్మీర్​పై పాక్​కు సౌదీ షాక్​- చమురు సరఫరా కట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.