ETV Bharat / bharat

భారత్​లో 19 కొత్త రకం కరోనా కేసుల గుర్తింపు - భారత్​లో 19 కొత్త రకం కరోనా కేసుల గుర్తింపు

కొత్త రకం వైరస్​ కేసులు భారత్​లోనూ వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 19 కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

uk-covid-19-strain-detected-in-india-tracing-of-contacts-intensified
భారత్​లో 19 కొత్త రకం కరోనా కేసుల గుర్తింపు
author img

By

Published : Dec 29, 2020, 9:52 PM IST

ఇప్పటి వరకు యూకే స్ట్రెయిన్​ రకం​ కేసులను 19 గుర్తించినట్లు జీనోమ్​ సీక్వెన్సింగ్​ ప్రయోగశాల ప్రకటించింది. ఈ కొత్త రకం వైరస్​​ కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను.. సంబంధిత అధికారులు ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

బ్రిటన్​లో కొత్త రకం వైరస్​ వెలుగు చూడగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడానికి సిద్ధమైంది. యూకే నుంచి తిరిగి వచ్చిన ఆరుగురిలో ఈ కొత్త వైరస్​ను కనుగొన్నారు. వాటిలో మూడు బెంగుళూరు, రెండు హైదరాబాద్, మరొకటి పూణెలో గుర్తించారు. వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్​లో ఉంచాయి.

- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

నవంబర్​ 25 నుంచి డిసెంబర్​ 23 వరకు దాదాపు 33వేల మంది ప్రయాణికులు బ్రిటన్​ నుంచి భారత్​లోని వివిధ ప్రాంతాలకు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరందరిని కనుగొని.. వారికి ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. ఇప్పటి వరకు 114 మందికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు స్పష్టం చేసింది. వీరి శాంపిళ్లను సార్స్ కోవ్​-2 వైరస్​ను గుర్తించే ప్రయోగశాలలకు పంపినట్లు తెలిపింది.

తాజా పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఐసీఎంఆర్​ సలహాదారు డా.సునీలా గార్గ్​.. ఈటీవీ భారత్​కు తెలిపారు.

కొత్త తరహా కేసుల గుర్తింపునకు ప్రయత్నిస్తున్నాం. సార్స్ కోవ్​-2 వైరస్​లో ఇప్పటి వరకు 23 ఉత్పరివర్తనలు జరిగాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్​ 'ఎన్​501వై' గా యూకే గుర్తించింది. బ్రిటన్​ నుంచి వచ్చిన చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. దీని వ్యాప్తి మునుపటి వైరస్​ కంటే 70 శాతం ఎక్కువగా ఉంది. డెన్మార్క్​, నెదర్లాండ్​, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్​, ఫ్రాన్స్​, స్పెయిన్​, స్విట్జర్లాండ్​, జర్మనీ, కెనడా, జపాన్​, లెబనాన్​, సింగపూర్​లలో ఇప్పటికే కొత్త రకం వైరస్​ను కనుగొన్నట్లు నివేదికలు వచ్చాయి.

- డా.సునీలా గార్గ్, ఐసీఎంఆర్​ సలహాదారురాలు.

ప్రస్తుత పరిస్థితుల్లో యూకే నుంచి అన్ని విమాన సర్వీసులను డిసెంబర్ 31​ వరకు రద్దు చేసింది భారత ప్రభుత్వం.

ఇదీ చదవండి: 'టీకాతో కొత్త స్ట్రెయిన్​ నుంచీ రక్ష'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.