ఈ నెల 6న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా భగవాన్‌పురలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి ఫతేవీర్ను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫతేవీర్ పడిపోయిన బోరుబావి 150 అడుగుల లోతుగా ఉంది.
ఈ రోజు ఫతేవీర్ పుట్టిన రోజు. బాలుడు సురక్షితంగా బయటకు రావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి పీజీఐ ఆస్పత్రి నుంచి వైద్యబృందం సంగ్రూర్‌లోని ఘటనా స్థలానికి చేరుకుంది.
ఫతేవీర్ను రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం, పటియాల సాయుధ ఇంజినీర్ల రక్షణ దళాలు సంయుక్త ఆపరేషన్‌ను చేపడుతున్నాయి. సహాయక చర్యల్లో స్థానికులూ సహకారాన్నందిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోని సునామ్-మాన్సా రహదారిపై పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
భగవాన్పురలోని తమ ఇంటిలో ఆడుకుంటున్న రెండేళ్ల ఫతేవీర్ పక్కనే ఉన్న బోర్‌వెల్‌లో పడిపోయాడు. ఇప్పటివరకూ ఎలాంటి ఆహారం పిల్లాడికి అందలేదని అధికారులు వెల్లడించారు. ఆక్సిజన్ మాత్రమే పంపించామని స్పష్టం చేశారు.
ఐదు రోజులైనా బాలుడు బయటకు రాకపోవడం వల్ల స్థానికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: మమతది కిమ్‌జోంగ్ వ్యక్తిత్వం: గిరిరాజ్