మహిళకు కాన్పు చేయించిన తర్వాత ఆమె కడుపులో నీడిల్(ఇంజక్షన్ చేసే సూది)ని వదిలేశారు తమిళనాడు రామనాథపురం ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర వైద్యులు. ఆ తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఎక్స్‌రే తీయించిన తర్వాత అసలు విషయం తెలిసింది.
రామనాథపురంలో నివాసముండే కార్తీక్.. తన భార్య రమ్యను ప్రసవం కోసం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చేర్పించాడు. ఈనెల 19న ఆడబిడ్డకు జన్మనిచ్చింది రమ్య. తర్వాత విపరీతంగా రక్తస్రావం కాగా.. పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడ ఎక్స్‌రే తీయించిన వైద్యులు రమ్య కడుపులో విరిగిపోయిన నీడిల్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించి శస్త్రచికిత్స ద్వారా నీడిల్‌ను తొలగించారు.
సస్పెండ్...
కడుపులో నీడిల్ వదిలిపెట్టారని మండిపడిన బాధితురాలి కుటుంబసభ్యులు రామనాథపురం ప్రాథమిక వైద్య కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు, నర్స్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా భాజపాతో కలిసేది లేదు'