ETV Bharat / bharat

దేశంలో వరుస అత్యాచార ఘటనల కలకలం - rape incident in up saharanpur

దేశంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. యూపీ సికిందర్​పుర్​లో 15 ఏళ్ల బాలికను అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అదే రాష్ట్రంలోని సహారాన్‌పుర్‌లో ఇద్దరు మైనర్ యువకులు ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. గుజరాత్​లో కన్న తండ్రే కసాయివాడిగా మారి ఏడేళ్ల కూతురిపై బలాత్కారం చేశాడు.

15-yr-old girl kidnapped, raped in UP's Ballia
మరో మూడు అత్యాచారాలు- కన్న కూతురిపైనే
author img

By

Published : Oct 3, 2020, 9:56 PM IST

దేశంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. కామాంధుల కర్కశత్వానికి హద్దులేకుండా పోతోంది. అత్యాచారానికి గురవుతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

హాథ్రస్, బలరాంపుర్ ఘటనలు మరవక ముందే ఉత్తర్​ప్రదేశ్​లోని సికిందర్​పుర్​లో 15 ఏళ్ల బాలికపై బలాత్కారం జరిగింది. బాలికను అపహరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు.

ఆసిఫ్(23)ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం(సెప్టెంబర్ 30న) ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశీలనలో ఉంచినట్లు వెల్లడించారు.

యూపీలో మరోటి..

ఉత్తర్​ప్రదేశ్‌లోని సహారాన్‌పుర్‌లో ఇద్దరు మైనర్ యువకులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నాకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బాధితురాలు.. తన ఇంట్లో నిద్రిస్తుండగా, ఇద్దరు యువకులు రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి.. బలాత్కారం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు.

కన్న కూతురిపైనే..!

గుజరాత్​ సూరత్​లో కన్న తండ్రే కామాంధుడిగా మారి తన ఏడేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఇంట్లో లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ కసాయి తండ్రి. తల్లి ఇంటికి వచ్చి ఆరా తీయగా.. విషయం బయటపడింది. అనంతరం వరఛా పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది బాధితురాలి తల్లి. బుధవారం జరిగిన ఈ ఘటనలో నిందితుడిని గంట వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇదీ చదవండి- ప్రియుడితో కలిసి సొంత చెల్లినే హత్య చేసింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.