ETV Bharat / bharat

దేశంలో మరో ఇద్దరికి కరోనా.. 47కు చేరిన కేసులు

భారత్​లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ వైరస్​ సోకినవారి సంఖ్య 47కు చేరింది.

Two people test positive for novel coronavirus in Pune
దేశంలో మరో ఇద్దరికి కరోనా.. 47కు చేరిన కేసులు
author img

By

Published : Mar 10, 2020, 5:34 AM IST

Updated : Mar 10, 2020, 6:24 AM IST

చైనాలో మొదలైన కరోనా వైరస్​ ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. భారత్​లోనూ ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా మహారాష్ట్రలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరిలో ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ వైద్యల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ఇద్దరితో కలిపి దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 47కు చేరింది.

రాష్ట్రాల వారీగా చూస్తే..

దిల్లీ-4, హరియాణా-14 (విదేశీయులు), కేరళ-9, రాజస్థాన్​-2 (విదేశీయులు), ఉత్తర్​ ప్రదేశ్​-9, మహారాష్ట్ర-2, లద్ధాఖ్​-2, తెలంగాణ, తమిళనాడు, జమ్ము కశ్మీర్​, పంజాబ్, కర్ణాటకలో ఒక్కో కేసు నమోదైంది.

5,400మందికి...

కరోనా వైరస్​ నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఏకకాలంలో 5 వేల 400 మందికిపైగా చికిత్స అందించేందుకు వీలుగా నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. 75 ఐసోలేషన్​ వార్డులను కూడా సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.

Last Updated : Mar 10, 2020, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.