ETV Bharat / bharat

దేశంలో మరో 3 కరోనా అనుమానిత కేసులు

దేశంలో మరో ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేశారు. దిల్లీలో ఒకరు, కోల్​కతాలో ఇద్దరిని ఐసోలేషన్​ వార్డుకు తరలించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు.

corona virus
దేశంలో మరో 2 కరోనా కేసులు నిర్ధరణ
author img

By

Published : Feb 13, 2020, 3:01 PM IST

Updated : Mar 1, 2020, 5:26 AM IST

కొవిడ్-19 ధాటికి చైనా గజగజ వణుకుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్​ కారణంగా ఆ దేశంలో 1,355 మంది బలయ్యారు. భారత్​లోనూ ఇప్పటికే పలు కేసుల నమోదు కాగా.. తాజాగా దిల్లీలో ఒకటి, కోల్​కతాలో 2 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు.

బంగాల్​ ఎన్​ఎస్​సీబీఐ విమానాశ్రయంలో బ్యాంకాక్​ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేశారు అధికారులు. వీరిని ఐసోలేషన్​ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

దిల్లీలో మరో కేసు!

బ్యాంకాక్​ నుంచి దిల్లీ వచ్చిన స్పైస్​జెట్​ విమానంలో ఒకరికి కరోనా వైరస్​ సోకినట్లు అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఏడాది జనవరి 17 నుంచి చైనా, హాంకాంగ్​, సింగపూర్​, బ్యాంకాక్​ నుంచి వస్తోన్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చైనా నుంచి భారత్​కు ఎలాంటి విమాన రాకపోకలు సాగడంలేదు.

ఇదీ చూడండి: కరోనా​ ఎఫెక్ట్​: లఘుశంకకూ సమయమివ్వని దుస్థితి!

Last Updated : Mar 1, 2020, 5:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.