ETV Bharat / bharat

యూపీలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం- ఇద్దరి అరెస్ట్​ - ఉత్తర్​ప్రదేశ్​లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల పసికందుపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

UP RAPE CASE
యూపీలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం- ఇద్దరి అరెస్ట్​
author img

By

Published : Dec 13, 2020, 1:02 PM IST

దేశంలో అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. యూపీలోని బుధానాలో ఓ మైనర్​పై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు ఛేదించిన పోలీసులు.. నిందితులిద్దరినీ అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

బుధానా జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల ఓ చిన్నారి తప్పిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇంతలో శుక్రవారం రాత్రి వాళ్ల ఇంటి మిద్దెపైనే.. ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉండటం గుర్తించారు. అనంతరం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసినట్టు తెలిపారు పోలీసులు. వారిపై ఐపీసీ సెక్షన్​-376డీ(సామూహిక అత్యాచారం), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఇదీ చదవండి: పదేళ్ల బాలికతో తాంత్రికుడు సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.