రాజస్థాన్‌లో రాజుకున్న రాజకీయ వేడి ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించటం లేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆడియో క్లిప్‌లతో మరింత దుమారం చెలరేగింది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రతో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడుతున్నారని.. కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజస్థాన్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
" ఎమ్మెల్యేల కొనుగోలు, సామాజిక మాధ్యమాల్లో ఆడియో క్లిప్‌ల వైరల్ పై.. ఐపీసీలోని సెక్షన్ 124-ఏ(తిరుగుబాటు), 120-బీ(కుట్ర)కింద రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఓ ఆడియో క్లిప్‌లో సంజయ్ జైన్ పేరు వినిపించిన నేపథ్యంలో విచారణకు పిలిపించి.. ప్రశ్నించాం."
- అశోక్ రాఠోడ్, ఏడీజీ(ఏటీఎస్, ఎస్ఓజీ)
అరెస్ట్‌కు డిమాండ్..
రెండు ఆడియో టేపుల ద్వారా కేంద్ర మంత్రి, భాజపా నేత గజేంద్ర సింగ్ షెకావత్, రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, భాజపా నేత సంజయ్ జైన్ల చర్చలు బయటపడ్డాయని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా. రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర వెలుగులోకి వచ్చిందటూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
-
कल सनसनीखेज वह चौंकाने वाले ऑडियो मीडिया के माध्यम से सामने आए।
— Randeep Singh Surjewala (@rssurjewala) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
इनमें तथा कथित तौर से भारत सरकार के कैबिनेट मंत्री श्री गजेन्द्र शेखावत जी, कांग्रेस विधायक श्री भवरलाल शर्मा जी व भाजपा नेता संजय जैन जी की तथा कथित बातचीत सामने आई।
राजस्थान सरकार गिराने का षड़यंत्र सामने आया👇🏼 pic.twitter.com/NQK2nWhQHt
">कल सनसनीखेज वह चौंकाने वाले ऑडियो मीडिया के माध्यम से सामने आए।
— Randeep Singh Surjewala (@rssurjewala) July 17, 2020
इनमें तथा कथित तौर से भारत सरकार के कैबिनेट मंत्री श्री गजेन्द्र शेखावत जी, कांग्रेस विधायक श्री भवरलाल शर्मा जी व भाजपा नेता संजय जैन जी की तथा कथित बातचीत सामने आई।
राजस्थान सरकार गिराने का षड़यंत्र सामने आया👇🏼 pic.twitter.com/NQK2nWhQHtकल सनसनीखेज वह चौंकाने वाले ऑडियो मीडिया के माध्यम से सामने आए।
— Randeep Singh Surjewala (@rssurjewala) July 17, 2020
इनमें तथा कथित तौर से भारत सरकार के कैबिनेट मंत्री श्री गजेन्द्र शेखावत जी, कांग्रेस विधायक श्री भवरलाल शर्मा जी व भाजपा नेता संजय जैन जी की तथा कथित बातचीत सामने आई।
राजस्थान सरकार गिराने का षड़यंत्र सामने आया👇🏼 pic.twitter.com/NQK2nWhQHt
దేనికైనా రెడీ..
కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఆ ఆడియోల్లో ఉన్నది తన గొంతు కాదని, ఈ విషయంలో ఎలాంటి దర్యాప్తు ఎదుర్కోవటానికైనా సిద్ధమని వెల్లడించారు.
ఇదీ చూడండి: పైలట్ వర్గంలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు