దేశంలో మూగజీవులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళలో రెండు, ఛత్తీస్‌గఢ్‌లో మూడు ఏనుగులు మృతి చెందిన ఉదంతాలు మరువకముందే.. ఒడిశాలో మరో రెండు గజరాజుల కళేబరాలు లభ్యమయ్యాయి. కేందుఝార్ జిల్లా అటవీప్రాంతంలో వీటిని గుర్తించిన అధికారులు.. వేటగాళ్ల దాడుల వల్లే అవి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
గురుబేడా సమీపంలోని బైతరణి అడవుల్లో రెండు ఏనుగుల్లో.. ఒకటి చనిపోయి వారంపైనే అయి ఉంటుందని చెప్పారు. మరో ఏనుగు మూడు రోజుల క్రితం చనిపోయిందని అంచనా వేశారు. అయితే ఆ ఏనుగుకు దంతాలు లేవని గుర్తించిన అధికారులు.. వాటికోసమే వేటగాళ్లు దాని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయి.
అనారోగ్యంతో మరో గజరాజు..
ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా అరణ్యాల్లో అనారోగ్యానికి గురైన ఓ ఏనుగును గుర్తించారు రాయ్‌పుర్, బిలాస్‌పుర్ అటవీ అధికారులు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని.. ప్రస్తుతం అది కోలుకుంటోందని తెలిపారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అనారోగ్యం బారినపడ్డ ఏనుగులను గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో మూడురోజుల్లో 3 ఏనుగులు మృతి