ఝార్ఖండ్‌లో అతిగా మద్యం సేవించిన వ్యక్తులు కొత్త సంవత్సరం తొలిరోజు వీరంగం సృష్టించారు. చుటియా ప్రాంతంలోని పటేల్ చౌక్ వద్ద రాత్రి రెండు గంటల సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వెళ్తున్న వ్యక్తులపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
క్యాటరింగ్ ముగించుకొని వెళ్తుంటే
ప్రమాదం జరిగిన వెంటనే పక్కనే ఉన్న స్థానికులు కారు డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితులందరూ క్యాటరింగ్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు చుటియా పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారు ప్రమాదకరమైన వేగంతో నియంత్రణ లేకుండా ప్రయాణించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: స్వాగతం 2020: బాపూజీ బాటలో డైరీ రాద్దాం