ETV Bharat / bharat

'చైనాలో లద్దాఖ్​'​పై ట్విట్టర్​కు మరిన్ని చిక్కులు!

లద్దాఖ్​ను చైనాలో భాగంగా చూపించడంపై పార్లమెంటరీ ప్యానల్​ (సమాచార భద్రత) ముందు హాజరయ్యారు ట్విట్టర్​ ప్రతినిధులు. ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అయితే.. ట్విట్టర్​ వివరణ అసంపూర్ణమని ప్యానల్​ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఈ చర్య ఏడేళ్లు శిక్ష పడే నేరాలతో సమానమని పేర్కొంది. ట్విట్టర్​ ఉన్నతాధికారుల నుంచి రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

author img

By

Published : Oct 28, 2020, 2:40 PM IST

Updated : Oct 28, 2020, 5:23 PM IST

Twitter
ట్విట్టర్​

భారత్​లోని లద్దాఖ్​ ప్రాంతాన్ని చైనా భూభాగంగా చూపటంపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది ట్విట్టర్​. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ(సమాచార భద్రత) విచారణకు ఆదేశించింది. పార్లమెంటరీ సంయుక్త కమిటీ ముందు ట్విట్టర్​ ప్రతినిధులు బుధవారం హాజరయ్యారు. లద్దాఖ్​ను చైనాలో భాగంగా చూపటంపై పలు ప్రశ్నలు అడిగారు ప్యానల్​ సభ్యులు. ఈ సందర్భంగా తమ సంస్థ భారతదేశ సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని తెలిపారు ట్విట్టర్​ ప్రతినిధులు.

ట్విట్టర్​ వివరణ అసంపూర్ణంగా ఉందని పేర్కొన్నారు ప్యానల్​ ఛైర్​పర్సన్​ మీనాక్షి లేఖీ. ఈ చర్య ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే నేరాలతో సమానమని తెలిపారు.

"లద్దాఖ్​ను చైనాలో భాగంగా చూపిన అంశంపై ట్విట్టర్​ వివరణ అసంపూర్తిగా ఉందని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అది భారత సౌర్వభౌమాత్వానికి వ్యతిరేకం. ఇది సున్నితమైన అంశం మాత్రమే కాదు, భారత సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించింది. లద్దాఖ్​ను చైనాలో భాగంగా చూపటం.. ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే నేరాలతో సమానం."

- మీనాక్షి లేఖీ, పార్లమెంటరీ ప్యానల్​ ఛైర్​పర్సన్​.

లద్దాఖ్​ను చైనాలో భాగంగా చూపటంపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ట్విట్టర్​ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు మీనాక్షి.

ట్విట్టర్​ ప్రతినిధులతో పాటు ఎలక్ట్రానిక్స్​, సమాచార, సాంకేతిక శాఖ, న్యాయ శాఖ అధికారులు పార్లమెంటరీ ప్యానల్ ముందు హాజరయ్యారు.

ఇదీ చూడండి: కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్!

Last Updated : Oct 28, 2020, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.