ETV Bharat / bharat

'చైనాలో లద్దాఖ్​' తప్పుపై ట్విట్టర్​ క్షమాపణలు - చైనాలో లద్దాఖ్​ ట్విట్టర్​

'చైనాలో లద్దాఖ్​' వ్యవహారంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీకి మౌఖికంగా క్షమాపణలు తెలిపింది ట్విట్టర్​. తమ సంస్థ భారతలోని సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని పేర్కొంది.

Twitter apologises for showing Leh, J-K in China
'చైనాలో లద్దాఖ్​' వ్యవహారంపై ట్విట్టర్​ క్షమాపణలు
author img

By

Published : Oct 29, 2020, 2:23 PM IST

భారత్​లోని లద్దాఖ్​ ప్రాంతాన్ని చైనా భూభాగంలో చూపటంపై.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ(సమాచార భద్రత)కి మౌఖికంగా క్షమాపణలు తెలియజేసింది ట్విట్టర్​.

లద్దాఖ్​ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ.. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఈ విషయంపై అఫిడవిట్​ను సమర్పించాలని బుధవారం ట్విట్టర్​ను ఆదేశించింది. ప్రస్తుతానికి మౌకికంగా క్షమాపణలు తెలిపిన ట్విట్టర్​... తమ సంస్థ భారత దేశ సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని పునరుద్ఘాటించింది.

ఈ నెల 19న జరిపిన ఓ లైవ్​ బ్రాడ్​కాస్ట్​లో.. లద్దాఖ్​ను చైనాలో భాగంగా చూపించింది ట్విట్టర్​. ట్విట్టర్​ వైఖరిపై భారత ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిద్దుబాటు చర్యలకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఉపక్రమించినా అప్పటికే దుమారం చెలరేగింది.

ఇదీ చూడండి:- 'ట్రంప్ ట్వీట్లపై చైనాతో పోలిస్తే మీరే కఠినం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.