ETV Bharat / bharat

లాకప్​డెత్​ కేసుపై సీబీఐ దర్యాప్తు షురూ

తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకల లాకప్​​ డెత్​ కేసులో దర్యాప్తు చేపట్టింది సీబీఐ. ఇప్పటికే రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసింది. పలువురు పోలీసులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tuticorin custodial deaths: CBI takes over probe, registers 2 FIRs
సీబీఐ చేతికి తండ్రీకొడుకల లాకప్​ డెత్​ కేసు
author img

By

Published : Jul 8, 2020, 2:37 PM IST

తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్​ డెత్​ కేసుపై విచారణ ప్రారంభించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. పోలీసు సిబ్బందిని ప్రశ్నించేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇప్పటికే పలువురు పోలీసులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

"తమిళనాడు ప్రభుత్వం అభ్యర్థన మేరకు.. తూత్తుకుడి జిల్లా సత్తానుకులం పోలీస్​ స్టేషన్​లో మృతిచెందిన కోవిల్​పట్టి జిల్లాకు చెందిన తండ్రీకొడుకుల లాక్​అప్​ డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసింది.​ నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతులు కోరనుంది."

--- ఆర్​.కె.గౌర్​, సీబీఐ ప్రతినిధి.

ఏం జరిగింది?

లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించి.. వారి సెల్​ఫోన్ దుకాణాన్ని తెరిచినందుకు పి. జయరాజ్, బెన్నిక్స్​ను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. అనంతరం వారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు సీబీ- సీఐడీతో విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 2న ఐదుగురు పోలీసులను అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి:- 'అక్కడ జార్జి ఫ్లాయిడ్.. ఇక్కడ జయరాజ్​-ఫెనిక్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.