పాక్ చెరలో ఉన్న భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఇచ్చిన తీర్పుపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయని ట్వీట్ చేశారు.
"కుల్‌భూషణ్ జాదవ్‌కు న్యాయం చేకూర్చడానికి ప్రభుత్వం చేసిన కృషిని నేను అభినందిస్తున్నా. ఐసీజే తీర్పు జాదవ్ కుటుంబ సభ్యులకు ఓదార్పునిస్తుందని, చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశిస్తున్నా."
-వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి
"ఐసీజే తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయి. నిజానిజాలు పరిశీలించి వాటి ఆధారంగా తీర్పు ఇచ్చినందుకు ఐసీజేకు అభినందనలు."- నరేంద్రమోదీ, భారత ప్రధానమంత్రి
'తమ ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత, సంక్షేమం కోసం పాటుపడుతుందని', మోదీ వ్యాఖ్యానించారు. కుల్‌భూషణ్ జాదవ్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్ల ఆయన తెలిపారు.
ఇదీ జరిగింది..
భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌పై గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలు మోపి పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో ఉరిశిక్షకు ఆదేశించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్... ఐసీజేను ఆశ్రయించింది.
భారత్ వాదనలు విన్న అంతర్జాతీయ న్యాయస్థానం అబ్దుల్కావి అహ్మద్ యూసఫ్ నేతృత్వంలోని అంతర్జాతీయ న్యాయస్థానం... కుల్‌భూషణ్ ఉరిశిక్ష నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఆయనకు వేసిన శిక్షను పునఃసమీక్షించాలని, పాకిస్థాన్‌ను ఆదేశించింది. ఇది భారత్‌కు అతిపెద్ద విజయం.
ఇదీ చూడండి: వైద్య కమిషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం