ETV Bharat / bharat

'అయోధ్య మసీదు విరాళాల కోసం రెండు బ్యాంకు ఖాతాలు' - Trust to open bank accounts

సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమకు కేటాయించిన ఐదెకరాల భూమిలో మసీదును నిర్మించేందుకు విరాళ సేకరణ ప్రక్రియను ఐఐసీఎఫ్​ ట్రస్ట్​ ప్రారంభించనుంది. ఇందుకోసం రెండు బ్యాంకు ఖాతాలను తెరవనున్నట్టు ట్రస్ట్​ కార్యదర్శి వెల్లడించారు.

Trust to open bank accounts, seek donations for Ayodhya mosque
'అయోధ్య మసీదు విరాళాల కోసం రెండు బ్యాంకు ఖాతాలు'
author img

By

Published : Aug 12, 2020, 2:06 PM IST

అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్​ బోర్టు ఏర్పాటు చేసిన ఇండో-ఇస్లామిక్​ కల్చరల్​ ఫౌండేషన్​(ఐఐసీఎఫ్​).. విరాళాల సేకరణ కోసం రెండు బ్యాంకు ఖాతాలను తెరవనుంది. అదే విధంగా ఆన్​లైన్​ ద్వారా విరాళాలు పొందేందుకు ఓ వెబ్​సైట్​ను కూడా ఈ ట్రస్ట్​ ఏర్పాటు చేయనుంది.

"విరాళాల కోసం రెండు ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని ట్రస్ట్​ నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు.. ధన్నిపుర్​ గ్రామంలో సున్నీ వక్ఫ్​ బోర్డుకు కేటాయించిన ఐదెకరాల స్థలంలో మసీదు, ఆసుపత్రి, వంటశాల, లైబ్రరీని ట్రస్ట్​ నిర్మిస్తుంది."

--- ఆథర్​ హుస్సేన్​, ట్రస్ట్​ కార్యదర్శి.

నిధుల విషయంలో అవకతవకలు జరగకుండా ఆడిట్​ కోసం ఓ అధికారిని కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు హుస్సేన్​. ముస్లిమేతరులు కూడా విరాళాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. విరాళాలు ఇవ్వడానికి ఇప్పటికే అనేకమంది నుంచి ఫోన్లు వచ్చినట్టు తెలిపారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.