ETV Bharat / bharat

సబర్మతిలో ట్రంప్​... మహాత్ముడి స్మరణ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ కుటుంబ సమేతంగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గాంధీ జీవిత విశేషాలను మోదీ వివరించారు.

trump-at-sabarmathi-ashramam
సబర్మతిలో ట్రంప్​... మహాత్ముడి స్మరణ
author img

By

Published : Feb 24, 2020, 12:45 PM IST

Updated : Mar 2, 2020, 9:32 AM IST

సబర్మతిలో ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. సతీమణి మెలానియా ట్రంప్​తో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీ జీవిత విశేషాలు, చరఖా ప్రాధాన్యాన్ని ట్రంప్​కు వివరించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

గాంధీజీ చిత్రపటానికి ట్రంప్​-మోదీ మాల వేశారు. అనంతరం గాంధీ తిప్పిన రాట్నాన్ని ట్రంప్​ దంపతులు తిప్పుతుంటే.. దాన్ని విశిష్టతను మోదీ వారికి వివరించారు. "చెడు వినకు- చెడు చూడకు- చెడు మాట్లాడకు" అని సందేశమిచ్చే 3 కోతుల ప్రతిమను ట్రంప్​కు బహూకరించారు మోదీ.

కాఫీ టేబుల్​ బుక్​ సహా 150 గాంధీ సూక్తులతో కూడిన మరో పుస్తకాన్ని అధ్యక్షుడికి బహుకరించారు ఆశ్రమ సభ్యులు.

అంతకుముందు అధ్యక్షుడికి భారతీయులు ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్​ రోడ్లన్నీ ట్రంప్​ నినాదాలతో హోరెత్తిపోయాయి.

'నమస్తే ట్రంప్​' వేడుకలో పాల్గొనడానికి సబర్మతి అశ్రమం నుంచి అగ్రనేతలిద్దరు మోటేరా స్టేడియానికి బయలుదేరారు.

Last Updated : Mar 2, 2020, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.