ETV Bharat / bharat

కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసు కి'లేడీ' అరెస్ట్ - nia arrested kerala gold smuggling accused

SWAPNA SURESH
స్వప్నా సురేశ్
author img

By

Published : Jul 11, 2020, 9:13 PM IST

Updated : Jul 11, 2020, 10:21 PM IST

21:19 July 11

కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్​, మరో నిందితుడు సందీప్​ నాయర్​లను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. కుటుంబసభ్యులతో పాటు ఆమెను బెంగళూరులో అధికారులు అరెస్ట్​ చేశారు. కేరళ కొచ్చిలోని ఎన్​ఐఏ కార్యాలయంలో ఆమెను ఆదివారం హాజరుపరుస్తారు.

ఇదీ కేసు...

ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన.. సరకు రవాణాలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి అయిన సరిత్‌ అనే వ్యక్తి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. సరిత్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఇందులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్​పై లుక్​ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ కాన్సులేట్‌కు వచ్చే పార్సిళ్ల ద్వారా 30 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసినట్లు తెలిసింది.

పక్కా సమాచారంతో....

సాధారణంగా కన్‌సైన్‌మెంట్‌గా పేర్కొనే పార్సిళ్లను తనిఖీ చేయరు. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు సోదాలు చేయగా అసలు విషయం బయటపడింది. పట్టుబడ్డ నిందితుడు సరిత్‌, గతంలో కేరళలోని యూఏఈ కాన్సులేట్‌లో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశాడు. స్వప్నా సురేశ్‌ కూడా ఇదే కార్యాలయంలో పనిచేసింది. దీంతో కేరళ ఐటీ శాఖలో పనిచేసే స్వప్నా సురేశ్‌ బంగారం స్మగ్లింగ్ కోసం నకిలీ కాన్సులేట్‌ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. గతంలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసిన స్వప్నా‌ను కేరళ ఐటీ శాఖలో ఏ ప్రాతిపదికన నియమించారనే అంశంపై దర్యాప్తు సాగుతోంది.

ఈ కేసుతో సంబంధముందన్న ఆరోపణలతో సీఎం కార్యదర్శిగా అదనపు బాధ్యతలను చూస్తున్న ఐటీ శాఖ కార్యదర్శి శివశంకర్‌ను రెండు బాధ్యతల నుంచి ఇటీవల తప్పించారు. 

21:09 July 11

బంగారం స్మగ్లింగ్​ కేసు ప్రధాన నిందితురాలు స్వప్న అరెస్టు

కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్​, మరో నిందితుడు సందీప్​ నాయర్​లను అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ).

Last Updated : Jul 11, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.