ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల్లో ప్రిసైడింగ్​ అధికారిగా 'ట్రాన్స్​జెండర్'​​

దేశంలోనే తొలిసారి ఓ ట్రాన్స్​జెండర్​.. ఎన్నికల పర్యవేక్షణ అధికారి (ప్రిసైడింగ్​ ఆఫీసర్​)గా నియామకమయ్యారు. వచ్చే బిహార్​ ఎన్నికల్లో పట్నాకు చెందిన ట్రాన్స్​జెండర్​ మోనికా దాస్​ విధులు నిర్వర్తించనున్నారు.

Transgender Monica Das
ట్రాన్స్​జెండర్​ మోనికా దాస్​
author img

By

Published : Oct 4, 2020, 1:35 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల నగార మోగిన క్రమంలో తమ సత్తా నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. అయితే.. ఈసారి బిహార్​ ఎన్నికల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. దేశంలోనే తొలిసారి ఓ ట్రాన్స్​జెండర్​.. ఎన్నికల పర్యవేక్షణ అధికారి (ప్రిసైడింగ్​ ఆఫీసర్​)గా విధులు నిర్వర్తించనున్నారు.

పట్నాకు చెందిన ట్రాన్స్​జెండర్​ మోనికా దాస్​ను ఎన్నికల ప్రిసైడింగ్​ అధికారిగా నియమించింది ఎన్నికల సంఘం. ఆమె దేశంలోనే తొలి ట్రాన్స్​జెండర్​ బ్యాంకు అధికారి కూడా. ప్రస్తుతం కెనరా బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారు. ​

బిహార్​ ఎన్నికల్లో ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటింగ్​ నుంచి ఇతర అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు మోనికా. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి శిక్షణను అక్టోబర్​ 8న ఇవ్వనున్నారు.

గతంలో..

మోనికా దాస్​ కన్నా ముందు రియా సిర్కార్​ అనే ట్రాన్స్​జెండర్​ ఉపాధ్యాయురాలు.. బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ అధికారిగా విధులు నిర్వర్తించారు.

అక్టోబర్​ 28న తొలి విడత..

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇప్పటికే ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్టోబర్​ 28న తొలి విడత పోలింగ్​ జరగనుంది. నవంబర్​ 3న రెండో విడత, నవంబర్​ 7న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత 10న లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: బిహార్ బరి: తేలిన మహాకూటమి లెక్క.. కాంగ్రెస్​కే ప్రయోజనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.